MHBD: పెద్దవంగర మండల కేంద్రంలో (ఐకేపీ) మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ ముద్దసాని పారిజాత-సురేష్ నేడు ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన ప్రతి గింజను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. దళారుల చేతిలో మోసపోవద్దని సూచించారు.