SRPT: కోదాడ డీఎస్పీ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా గోడ పత్రికలు, కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డా. బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నివారణోపాయాలు పాటించడం ద్వారా ఆస్తి, ప్రాణ నష్టాలను అరికట్టవచ్చని సూచించారు.