SRCL: వేములవాడ బార్ అసోసియేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. 18, 19 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 20 తేదీన నామినేషన్ల పరిశీలన, 23వ తేదీన నామినేషన్ల ఉప సంహరణ, అనంతరం తుది జాబితా ప్రకటించనున్నట్లు బార్ అసోసియేషన్ ఎలక్షన్ ఆఫీసర్ తిరుమల గౌడ్ తెలిపారు. ఈనెల 28న ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువరించనున్నట్లు పేర్కొన్నారు.