NRML: కుంటాల మండలంలో జరిగిన మొక్కజొన్న సంచుల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను గుర్తించగా, నలుగురిని అరెస్ట్ చేసి, ఒకరు పరారీలో ఉన్నారు. భైంసా ప్రాంతానికి చెందిన యువకులే ఈ చోరీకి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 75 వేల నగదు స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్కు తరలించారు. పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.