ATP: రాష్ట్ర సిసిఎల్ఏ ప్రిన్సిపాల్ కమిషనర్ జయలక్ష్మి బుధవారం విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఓ. ఆనంద్, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా 22A కేసులు, రీ-సర్వే పురోగతి, పాసుపుస్తకాల పంపిణీ, జలధార ప్రాజెక్టు అమలుపై ఆమె సమీక్షించారు.