NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అమ్మవార్ల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు గురువారం చేపట్టారు. దాదాపుగా 30 రోజులకు గాను రూ. 28,28,348 రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. హుండీల ద్వారా వచ్చిన మొత్తమును ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పెంచలకోన బ్రాంచ్నకు జమ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.