KRNL: ఆలూరు అరికెర గురుకుల పాఠశాలలో విద్యార్థుల అలజడిపై ఇవాళ అధికారులు విచారణ చేపట్టారు. మద్యపానం, సిగరెట్లు, హాస్టల్ ఘటనలపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. సిబ్బంది బాధ్యతగా వ్యవహరించి విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మార్వో సువర్ణమ్మ సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.