విజయనగరం రైల్వే స్టేషన్లో గురువారం ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ప్లాట్‌ఫారమ్‌పై అనుమానాస్పదంగా ఉన్న వారిని తనిఖీ చేయగా 8 కిలోల గంజాయి లభ్యమైంది. దీని విలువ రూ. 40 వేలు ఉంటుందని ఎస్సై బాలాజీరావు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి వారిని రైల్వే కోర్టుకు తరలించినట్లు పేర్కొన్నారు.