GDWL: ఎమ్మెల్యే విజయుడు సోమవారం జోగుళాంబ దేవి, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు ఆయనను శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.