MHBD: జిల్లాలోని పోలీస్ ఇంట్లో దొంగలు పడ్డారు. SI ఉమా తెలిపిన వివరాల మేరకు.. డోర్నకల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లో చొరబడి రూ.40,000 నగదు, వెండి వస్తువులను దొంగలించారు. ఘటనా స్థలాన్ని సీఐ చంద్రమౌళి క్లూస్ టీంతో పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.