BHPL: మహాముత్తారం మండలం కేంద్రంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై గ్రామ సర్పంచ్ బాపు అధ్యక్షతన బుధవారం గ్రామసభ నిర్వహించారు. రైతులకు మార్కెట్ ధర కంటే ఆరు రెట్లు ఎక్కువ పరిహారం ఇవ్వాలని అధికారులను కోరారు. కాలువల వల్ల ఇళ్లకు నష్టం జరగకుండా మినహాయింపులు ఇవ్వాలని, పొలాల మధ్య కాలువలపై వంతెనలు నిర్మించాలని సూచించారు. రైతులు విజ్ఞప్తి చేశారు.