నిజామాబాద్ రూరల్ లోని మల్కాపూర్ తండాలో వాలీబాల్ కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. FEB 27న తండాకు చెందిన యువకులు వాలీబాల్ ఆడుతుండగా విక్రమ్ వాలీబాల్‌ను కొట్టగా అక్కడే ఉన్న బుజ్జి బాయి అనే వృద్ధురాలికి తగిలింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆదివారం ఇరువర్గాల వారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.