ADB: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జైలులో గురువారం మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును DMHO నరేందర్ రాథోడ్, జైలు పర్యవేక్షణాధికారి గోపిరెడ్డి ప్రారంభించారు. 200 మంది ఖైదీలకు HIV, టీబీ పరీక్షలు, బీపీ, షుగర్, ఇతర సుఖ వ్యాధుల పరీక్షలు, కంటి పరీక్షలు, ఛాతీ ఎక్స్రే పరీక్షలు చేశారు. అనంతరం వారికి ఆరోగ్య సూత్రాలను వివరించారు.