SDPT: విద్యార్థులలో చారిత్రక సంపదపై అవగాహన, పరిశోధనలను పెంపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర వారసత్వ శాఖ చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. వారసత్వ, పురావస్తు శాస్త్రాలపై విద్యార్థులకు లోతైన అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.ప్రణీత తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.