అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమాలా గార్డెన్లో బుధవారం నిర్వహించిన ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత పాల్గొన్నారు. విద్యా, రవాణా శాఖల, వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.