నల్లగొండ ప్రకాశం బజార్లో చిరువ్యాపారుల తొలగింపును మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముందస్తు నోటీసులు లేకుండా షాపులు కూల్చడం దుర్మార్గమని, అధికారుల తోపులాటలో గాయపడ్డ పండ్ల వ్యాపారి అమీర్‌ను ఆయన శుక్రవారం పరామర్శించారు. ప్రభుత్వం చిరువ్యాపారులకు నష్టపరిహారం చెల్లించి, శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.