భువనగిరి ఏరియా ఆసుపత్రి పరిస్థితి దారుణంగా తయారయింది. ఇవాళ ఉదయం మోటకొండూర్కు చెందిన గడ్డం యాదగిరి తాటి చెట్టుపై నుంచి పడి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి పేషెంట్ వస్తే కనీసం స్ట్రెక్చర్ తీసుకువచ్చే సిబ్బంది కుడా లేరు. పెషెంట్ తరుపు బంధువులే లోపలికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి దాపరించింది.