HNK: ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన నలుగురు (ఎర్రబెల్లి శరత్, వెంకటరెడ్డి, లేనిన్, బొడ్డు అరుణ) మంగళవారం ఇందిరమ్మ కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మండల అధికారికి లేఖ ఇచ్చారు. గ్రామంలో కమిటీ సభ్యుల ప్రమేయం లేకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లబ్దిదారుల ఎంపిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, లబ్ధిదారుల లిస్టు ఇవ్వమన్నా ఇవ్వడం లేదని వాపోయారు.