SDPT: బెజ్జంకి మండలం గుగ్గిళ్ళ గ్రామ చెక్‌డ్యాం వద్ద చేపలు పట్టేందుకు వెళ్లిన తిప్పరవేణి రాజయ్య (45) అకస్మాత్తుగా తల తిరుగుతూ అస్వస్థతకు గురయ్యాడు. నీటి నుంచి బయటకు రాగానే ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య ఎల్లవ్వ, కుమారులు పవన్, చరణ్ ఉన్నారు.