NRPT: బిజినేపల్లి మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన టి. తిరుపతయ్యను ‘తపస్’ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు దెంది రాజారెడ్డి ఆధ్వర్యంలో ఆయనను గౌరవించారు. విద్యాశాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో సంఘం మండల ప్రతినిధులు పాల్గొన్నారు.