ADB: ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తున్నట్లు జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ తెలిపారు. శుక్రవారం MLA పాయల్ శంకర్, ఎయిర్ ఫోర్స్ అధికారులతో కలిసి సంబంధిత ప్రాంతంలో సర్వే నిర్వహించారు. ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని యువరాజ్ మర్మాట్ పేర్కొన్నారు.