SRPT: అంగన్వాడీల హక్కుల పోరాటాన్ని అణచివేయడం సరికాదని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంపటి గురూజీ అన్నారు. సోమవారం సూర్యాపేటలో అరెస్టయిన టీచర్లను పరామర్శించిన ఆయన.. ప్రభుత్వం నిర్బంధ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, సర్పంచ్ల పెత్తనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.