VKB: తోర్మామిడి గ్రామపంచాయతీకి కొత్త ప్రధాన కార్యదర్శిగా మంగళవారం సుశీల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తోర్మామిడి గ్రామానికి విచ్చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేసి ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.