RR: చేవెళ్ల మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పలువురు మాట్లాడుతూ.. గ్రామాలలో అందరూ కులాలకు అతీతంగా కలిసి ఉన్నప్పుడే అంబేద్కర్ ఆశయం నెరవేరుతుందని, ఆయన ఆశయాలను నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందన్నారు.