BHNG: అడ్డగూడూరు ఎస్సై వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా వాహనాలు నడపాలని ప్రజలకు అవగాహన కల్పించారు. నిబంధనలో అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ సంతోష్ పాల్గొన్నారు.