RR: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య విద్యార్థులను సన్మానించి, మెడల్స్ అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి చదివి భవిష్యత్లో ఉన్నత స్థాయిలకు వెళ్లాలని సూచించారు.