WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని రిజర్వాయర్ నుంచి అనుమతి లేకుండా మంగళవారం తెల్లవారుజామున అక్రమ మట్టి దందా సాగుతోంది. జేసీబీ, ట్రాక్టర్లలో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పర్వతాల శివాలయం మెట్ల వద్ద ఉన్న మట్టిని కూడా అక్రమంగా తీసుకెళ్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.