NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని గాంధీ చౌక్‌లో BJP మండల అధ్యక్షుడు జీర్రా మహిపాల్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మను ఇవాళ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ.. దేశాన్ని అన్ని రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతున్న మోడీని తీవ్రవాది అనడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.