SRPT: అనంతగిరికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు రాకపోవడంతో ఇఫ్కో ఆర్థిక సహాయంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన బస్సు షెల్టర్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి అనంతగిరికి బస్సు సర్వీసులు ప్రారంభించి, ఈ షెల్టర్‌ను వినియోగంలోకి తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.