WNP: గోపాలపేట మండలంలోని చెన్నూరు దారిలోని వాగులో ఇసుక తీసుకెళ్లడానికి వచ్చిన ట్రాక్టరు, JCB లను గుర్తించి తహసీల్దారు తిలక్ రెడ్డి ఆదేశాల మేరకు గోపాల్ పేట వీఆర్వో సురేష్ కుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చారని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. పట్టుబడిన వాహనాలు ఇసుకను తరలించడానికి అనుమతులు లేకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.