HNK: కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్ MBA ,MCA నాలుగో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ అధికారులు విడుదల చేశారు. MBA పరీక్షలు మే 14,16,18, 20, 22, 25, 28 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, MCA పరీక్షలు మే 14, 16, 18 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలని కోరారు.