MHBD: నెల్లికుదురు మండలంలోని నర్సింహులగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకుండానే రూ.4.50 లక్షలకు సంబంధిత అధికారులు డబ్బులు డ్రా చేసుకోవడానికి ఎంబీ రికార్డులు చేసి ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై ఎంపీడీవో, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి తగ్గిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.