HYD: పీక్ అవర్స్‌లో నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. యశోదా హాస్పిటల్, నల్గొండ ఎక్స్ రోడ్, రోటరీ నుంచి చాదర్ ఘాట్ ఎక్స్ రోడ్ వరకు వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. రద్దీ కారణంగా ప్రయాణానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రయాణికులు ముందుగానే ప్రణాళికలు చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని సూచించారు.