MBNR: ఇరాన్- ఇజ్రాయిల్ ఉద్రిక్తతల నేపథ్యంలో జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా, బ్లాక్ మార్కెట్ నియంత్రణకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ హరిప్రియ తెలిపారు. హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్ల అక్రమ నిల్వలపై ఫిర్యాదులు స్వీకరిస్తారు. వివరాలకు సీనియర్ అసిస్టెంట్ దేవేందర్ రెడ్డి 9666052780, 9912659005 నంబర్లను సంప్రదించాలని సూచించారు.