MDK: తూప్రాన్ గాంధీ నగర్లో బుధవారం రాత్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ జాగృతి దివస్ నిర్వహించారు. తూప్రాన్ ఎస్సై గంగరాజు ఆధ్వర్యంలో సైబర్ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆన్లైన్ భద్రత, సైబర్ ముప్పులు, సైబర్ మోసాలు, పాస్ వర్డ్ భద్రత, సోషల్ మీడియా భద్రత, నివారణ మార్గాలపై అవగాహన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సై -2 యాదగిరి, సిబ్బంది పాల్గొన్నారు.