MHBD: పోలీస్ స్టేషన్కు వెళ్లలేని స్థితిలో ఉన్న బాధితుడి వద్దకే వెళ్లి FIR నమోదు చేసిన ఘటన బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బయ్యారం గ్రామానికి చెందిన రాయల సతీష్ అనే వ్యక్తి గాయపడ్డాడు. ఎస్సై తిరుపతి స్వయంగా వెళ్లి బాధితుడిని పరామర్శించి, అతని నుండి ఫిర్యాదును స్వీకరించి ఆన్ -సైట్ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి ఈ కేసును BNS చట్టంలోని నమోదు చేశారు.