MHBD: కురవి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ డి. వీరన్న నాయక్ టీపీసీసీ డాక్టర్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ చేతుల మీదుగా కురవిలో నియామక పత్రాన్ని అందుకున్నారు. వారికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.