గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామంలో సోమవారం ఉపాధి హామీ కూలీలకు వాహన నియమ నిబంధనలపై కానిస్టేబుల్ ఇస్మాయిల్ అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.