ASF: వాంకిడి మండలం దొడ్డిగూడ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన లక్ష్మణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పెళ్లికి వెళ్తుండగా రోడ్డుపైకి వచ్చిన ఆవును తప్పించబోయి బైక్ అదుపుతప్పి పడడంతో అతని తలకు తీవ్ర గాయం కాగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు.