PDPL: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ధర్మారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజేశ్వరి, నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దళిత, బహుజనుల ఉద్దరణకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.