కృష్ణా: ఇంటర్ ఫలితాల్లో గుడివాడ నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థి పొదిలపు వేదశ్రీ ఇవాళ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్‌గా నిలిచింది. వేదశ్రీ సాధించిన ఈ విజయంపై కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు.