PDPL: SRSP కాకతీయ కెనాల్ D-83, D-86 కాలువలకు చివరి విడత సాగునీటిని ఇవాళ విడుదల చేసినట్లు జిల్లా నీటిపారుదల శాఖ అధికారి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని రైతులు నీటిని సద్వినియోగం చేసుకొని పంటలు కాపాడుకోవాలని సూచించారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, M.S. రాజ్ ఠాకూర్, కలెక్టర్ శ్రీ నీటి విడుదలకు కృషి చేశారని ఆయన వెల్లడించారు.