AP: అల్లూరి జిల్లా మోదకొండమ్మ జాతర తేదీల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వమే జాతర తేదీలు ఖరారు చేస్తుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. మే 17,18,19 తేదీల్లో జాతర నిర్వహిస్తామని మంత్రి అన్నారు. మే 10, 11, 12 తేదీలను కమిటీ ఖరారు చేసిందని MLA తెలిపారు. దీంతో మంత్రి సంధ్యారాణి, MLA విశ్వేశ్వరరాజు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదంతో MLA సమావేశం నుంచి వెళ్లిపోయారు.