BDK: బూర్గంపాడు మండలం, సారపాక ITC 14వ వేతన ఒప్పందంలో జరుగుతున్న జాప్యంపై కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశాయి. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరాయి. యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిని విమర్శిస్తూ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.