NGKL: నాగర్కర్నూల్ ZPHSలో జరిగిన ‘అరైవ్ లైవ్’ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రతి 4 నిమిషాలకు ఒక ప్రమాదం జరుగుతోందని, యువత జాగ్రత్తగా ఉండాలని కోరారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించారు. నియమాలు పాటిస్తేనే ప్రాణాలు, కుటుంబాలు సురక్షితమని ఆయన పేర్కొన్నారు.