BDK: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై ఈ నెల 24న అవగాహన సమావేశం నిర్వహించనున్నారు. వైటీసీ భవనంలో జరిగే ఈ సదస్సులో వివిధ వృత్తి కోర్సులు, శిక్షణ అవకాశాలపై వివరాలు అందించనున్నారు. ఉచిత వసతి, భోజనం సదుపాయాలతో శిక్షణ అందుబాటులో ఉండగా, అభ్యర్థులు సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.