మరోసారి భారత్, పాకిస్తాన్ జట్లు క్రికెట్ మైదానంలో తలపడనున్నాయి. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో భాగంగా ఈ రెండు జట్ల మధ్య నవంబర్ 16న మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో భారత జట్టుకు జితేశ్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీ ఖతార్ వేదికగా నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది.
ఆసియా కప్‌లో IND vs PAK మ్యాచ్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పలువురు ఆటగాళ్లపై ICC చర్యలు తీసుకుంది. సూర్యకుమార్ మ్యాచ్ ఫీజులో 30% జరిమానాతో పాటు 2 డీమెరిట్ పాయింట్లు.. బుమ్రాకు ఒక డీమెరిట్ పాయింట్ వేసింది. పాక్ ఆటగాడు హారిస్ రౌఫ్‌పై 2 మ్యాచ్‌ల నిషేధంతో మ్యాచ్ ఫీజ్‌లో 30% కోత విధించగా, ఫర్హాన్‌కు ఒక డీమెరిట్ పాయింట్ పడింది.
IPL-2026 మినీ వేలానికి ముందు SRH తమ స్టార్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 2025 సీజన్లో క్లాసెన్‌ను రూ.23 కోట్లతో రిటైన్ చేసుకుంది. అయితే, అతడు ఆ సీజన్లో అంతగా రాణించలేదు. దీంతో, అతడిని వేలంలో వదిలేసి.. తక్కువ ధరకు తిరిగి దక్కించుకోవాలని చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ప్రపంచకప్ గెలిచిన సంతోషంలో ఉన్న టీమిండియా ఓపెనర్ స్మృతి మంధానకు ICC అనూహ్య షాక్ ఇచ్చింది. WCలో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసినప్పటికీ, ఆమె వన్డే బ్యాటర్ల తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయింది. స్మృతిని వెనక్కి నెట్టి సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. WCలో లారా 571 పరుగులు చేయగా, మంధాన 434 పరుగులు మాత్రమే చేసింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)-2026 సీజన్‌కు ముందు RCB జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు హెడ్ కోచ్ ల్యూక్ విలియమ్స్ తప్పుకోవడంతో, అతడి స్థానంలో తమిళనాడు మాజీ క్రికెటర్ మలోలన్ రంగరాజన్‌ను కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది. అలాగే, ఇంగ్లండ్ మాజీ పేసర్ అన్యా ష్రబ్సోల్ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది.
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బిగ్‌బాష్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. మోకాలి గాయం కారణంగా అతడు 15వ ఎడిషన్‌కు దూరమయ్యాడు. ఈ సీజన్లో సిడ్నీ థండర్ జట్టుతో అతడు ఒప్పందం చేసుకున్నాడు. గాయంతో అశ్విన్ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. కాగా, ఇప్పటివరకు BBLలో ఏ భారత క్రికెటర్ ఆడలేదు.
గోల్డ్ కోస్ట్ వేదికగా టీమిండియాతో జరగనున్న నాలుగో టీ20పై ఆస్ట్రేలియా స్పిన్నర్ మాథ్యూ కునెమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మను కట్టడి చేస్తామని చెప్పాడు. అందుకు తగ్గ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించాడు. కీలకమైన నాలుగో టీ20లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ హర్మన్ ప్రీత్, అమన్ జ్యోత్‌కు రివార్డు ప్రకటించింది. టీమిండియా మహిళల వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన తమ రాష్ట్ర క్రికెటర్లు కావడంతో రూ.11 లక్షల చొప్పున రివార్డు అందజేయనుంది. అలాగే, జట్టు ఫీల్డింగ్ కోచ్ మునీష్ బాలికి రూ.5 లక్షల రివార్డు ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని వారికి త్వరలోనే అందించనున్నట్లు వెల్లడించింది.
ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం ఇండియా-A జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. జట్టు: ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, వధేరా, నమన్ ధీర్(VC), సూర్యాంష్ షెడ్జ్, జితేష్ శర్మ(C), రమణ్ దీప్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యష్ ఠాకూర్, గుర్జర్ నీత్ సింగ్, విజయ్ కుమార్ వైశాక్, యుధ్ వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్(WK), సుయాష్ శర్మ.
మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. ఈ గెలుపులో యువ ఓపెనర్ ప్రతీకా రావల్ పాత్ర కూడా ఉంది. ఈ టోర్నీలో ఆమె 7 మ్యాచుల్లో 51.33 సగటుతో 308 పరుగులు చేసింది. కానీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైంది. ఆమె స్థానంలో సెమీఫైనల్, ఫైనల్ కోసం షెఫాలి వర్మ జట్టులోకి వచ్చింది. ICC నిబంధనల ప్రకారం 15 మంది సభ్యుల జట్టుకు పతకాలు ఇస్తారు. దీంతో ప్రతీక పతకం అందుకోలేకపోయింది.
మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. ఈ గెలుపులో యువ ఓపెనర్ ప్రతీకా రావల్ పాత్ర కూడా ఉంది. ఈ టోర్నీలో ఆమె 7 మ్యాచుల్లో 51.33 సగటుతో 308 పరుగులు చేసింది. కానీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైంది. ఆమె స్థానంలో సెమీఫైనల్, ఫైనల్ కోసం షెఫాలి వర్మ జట్టులోకి వచ్చింది. ICC నిబంధనల ప్రకారం 15 మంది సభ్యుల జట్టుకు పతకాలు ఇస్తారు. దీంతో ప్రతీక పతకం అందుకోలేకపోయింది.
మహిళల భారత జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. అయితే, విజయోత్సవ ర్యాలీ ఇప్పుడే జరిగేలా లేదు. ఈ విషయాన్ని BCCI సెక్రటరీ దేవ్జిత్ సైకియా వెల్లడించారు. దుబాయ్‌లో ఇవాళ్టి నుంచి 7 వరకు ICC సమావేశాలు జరగనున్నాయి. ఇవి ముగిసిన తర్వాత సీనియర్ అధికారులు భారత్‌కు రానున్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపిందని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘భారత మహిళల జట్టు విజయం.. గతంలో సాధించిన ప్రపంచ కప్‌ల కంటే గొప్పది. ప్రస్తుతం మహిళ జట్టు విజయంతో.. చాలామంది వనితలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంపిక చేసుకునేందుకు వారిలో ప్రేరణకు కారణమవుతుంది’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన ఆరాధ్య క్రికెటర్ అని టీమిండియా మహిళల జట్టు లెఫ్టార్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి తెలిపింది. యువరాజ్ సింగ్ కొట్టిన 6 బంతుల్లో 6 సిక్స్‌ల వీడియోను లెక్కలేనన్ని సార్లు చూశానని చెప్పింది. యువరాజ్ సింగ్లా సిక్స్‌లు కొట్టడం తన కోరిక అని ఈ కడప అమ్మాయి తన మనసులోని మాటను బయటపెట్టింది.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ICC మహిళల వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. అయితే, 2024-25లో హర్మన్ నికర ఆస్తులు రూ.25 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఆదాయం క్రికెట్ నుంచే కాకుండా, ఎండార్స్మెంట్, బ్రాండ్ అగ్రిమెంట్లు, లీగ్ క్రికెట్ నుంచి కూడా వస్తుంది. టెస్టు మ్యాచుకు రూ.15 లక్షలు, వన్డే రూ.6 లక్షలు, T20 రూ.3 లక్షలు తీసుకుంటుంది.