అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ఓటమిపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి మూడు ఓవర్లతో పాటు మిడిల్ ఓవర్లలో పరుగులు చేయకపోవడం ఓటమికి కారణమని తెలిపాడు. బౌలింగ్‌లో ఇవ్వాల్సిన పరుగుల కంటే ఎక్కువ ఇచ్చామని.. ఫీల్డింగ్‌లో కూడా తప్పులు జరిగాయని పేర్కొన్నాడు.
పంజాబ్ ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 244 పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో గుజరాత్ 232/5 పరుగులకే పరిమితమైంది. సాయి సుదర్శన్ (74) బట్లర్ (54), రూథర్‌ఫోర్డ్ (46) పోరాడినప్పటికీ తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఇక పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తండ్రైన విషయం తెలిసిందే. అతడి భార్య అతియా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా వారిద్దరూ కుమార్తెతో దిగిన ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, ఆ ఫొటోలో ఎలాంటి వాస్తవం లేదు. అది ఏఐ జనరేటెట్ ఫొటో అని వెల్లడైంది. అచ్చం చూడ్డానికి ఒరిజినల్ ఫొటోను పోలి ఉండటంతో ఈ ఇమేజ్ను నిజమే అనుకుని చాలామంది షేర్ చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. IPLలో కోహ్లీ ఇప్పటివరకు 64 హాఫ్ సెంచరీలు చేశాడు. మరో మూడు హాఫ్ సెంచరీలు చేస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ వార్నర్(66) పేరిట ఉంది. తర్వాత స్థానాల్లో శిఖర్ ధావన్(53), రోహిత్ శర్మ(45), డివిలియర్స్(43) ఉన్నారు.
ఢిల్లీ ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నోపై ఘనవిజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లు స్టబ్స్ (34), విప్రజ్ నిగమ్ (39) పరుగులతో రాణించారు. అశుతోష్ (66*) కీలక ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీకి విజయం అందించాడు.
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో నికోలస్ పూరన్ కూడా దూకుడు పెంచాడు. విప్రజ్ వేసిన ఏడో ఓవర్లో చివరి నాలుగు బంతుల్లో మూడు సిక్స్‌లు బాదాడు. వరుసగా రెండు సిక్స్‌లు బాదిన తర్వాత పూరన్ ఇచ్చిన క్యాచ్‌ను సమీర్ రిజ్వీ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం LSG 9 ఓవర్లకు 108 పరుగులు చేసింది. పూరన్ (33*), మార్ష్ (57*) పరుగులతో ఉన్నారు.
IPL: ఈ సీజన్లో తన తొలి మ్యాచ్‌లోనే SRH బ్యాటర్లు దంచికొట్టారు. RRతో జరుగుతున్న మ్యాచ్‌లో 20 ఓవర్లలో 286/6 పరుగుల భారీ స్కోర్ చేశారు. ఇషాన్(106*) సెంచరీతో చెలరేగాడు. హెడ్(67), క్లాసెన్(34) విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయారు. అభిషేక్(24), నితీష్(30) రాణించారు. RR బౌలర్లలో తీక్షణ 2, తుషార్ 3, సందీప్ ఒక వికెట్ తీసుకున్నారు.
SRH ప్లేయర్ ఇషాన్ కిషాన్ ఈ సీజన్ ఐపీఎల్లో తొలి సెంచరీ సాధించాడు. RRతో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 45 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.
ప్రకాశం: తర్లుపాడు మండలంలోని జగన్నాధపురం గ్రామంలో ఈనెల 30 నుండి రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరగనున్నది. కాగా ఇవ్వాలా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చేతులు మీదుగా సంబంధిత వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. విన్నర్స్కి వరుసగా రూ.70వేలు, రూ. 50వేలు, రూ. 30వేలు, రూ.10వేలు అందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో KKR కెప్టెన్ అజింక్య రహానే దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. కేవలం 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 8 ఓవర్లలో RCB 80/1 పరుగులు చేసింది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘హరిహర వీరమల్లు’ మూవీ టీమ్ గుడ్ న్యూస్ అందించింది. ఈ సినిమా డబ్బింగ్ ప్రారంభమైనట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సాటిలేని హీరోయిజం ప్రయాణం వెండితెరకు మరింత చేరువైనట్లు పేర్కొంది. కాగా ఈ మూవీ వేసవి కానుకగా మే 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌కు ఇస్తారు. ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ 3 సార్లు (2015-562, 2017-641, 2019-692), విరాట్ కోహ్లీ 2 సార్లు (2016-973, 2024-741), క్రిస్ గేల్ 2 సార్లు (2011-608, 2012-733) ఆరెంజ్ క్యాప్ గెలిచారు. వార్నర్ మూడుసార్లు గెలిచిన ఏకైక ఆటగాడు. గేల్ వరుసగా రెండు సార్లు గెలిచాడు. 2025లో ఎవరు గెలుస్తారో చూడాలి.
HNK: గోవాలో ఐదు రోజులపాటు జరిగే నలభై ఏడవ భారత మాస్టర్స్ (వెటరన్) నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలకు హనుమకొండ జేఎన్ఐఎస్ నుండి 18 మంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనేందుకు నేడు వెళ్లారు. టీబిఏ అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో షటిల్ క్రీడాకారులు ఉత్సాహంగా హనుమకొండ నుండి గోవా బయలుదేరారు.
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ గురించి అశ్విన్ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. తన వందో టెస్టు జ్ఞాపికను అందజేయడానికి రమ్మని ధోనీని ఆహ్వానించినట్లు వెల్లడించాడు. కానీ, ధోనీ రాలేకపోయినట్లు తెలిపాడు. అయితే, మళ్లీ CSKకు తీసుకుని తనకు గిఫ్ట్ ఇస్తాడని తాను ఊహించలేదని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ధోనీకి ధన్యవాదాలు తెలిపాడు. తనవల్లే ఈ స్థాయిలో ఉన్నట్లు వ్యాఖ్యానించాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ బ్రాడ్కాస్టర్స్కు చురకలంటించాడు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ప్రసారకర్తల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘నేను ఏం తింటున్నాను? నాకు ఇష్టమైన చోలే బటూరే ఢిల్లీలో ఎక్కడ దొరుకుతుంది? అనే విషయాలపై చర్చ అవసరం లేదు. దానికి బదులుగా ఒక అథ్లెట్‌గా ఏం చేస్తున్నా అనే దానిపై చర్చించవచ్చు’ అని పేర్కొన్నాడు.