T20ల్లో శుభ్‌మన్ గిల్ స్ట్రైక్‌రేట్‌పై భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతను చాలా నెమ్మదిగా ఆడుతున్నాడంటూ కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ గిల్‌కు మద్దతుగా నిలిచాడు. ఇతర బ్యాటర్లంతా విఫలమైన పిచ్‌పై కూడా గిల్ పరుగులు చేశాడని పఠాన్ గుర్తుచేశాడు. టీ20ల్లో గిల్‌ను తప్పకుండా ఆడించాలని పఠాన్ వ్యాఖ్యానించాడు.
మహమ్మద్ షమీ రంజీల్లో మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ, జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో అతను భారత్ జట్టులోకి తిరిగి రావడం కష్టమేనంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దీనిపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. షమీ ఖచ్చితంగా టీమిండియాలోకి తిరిగి వస్తాడని తెలిపాడు. సెలక్టర్లు అతడికి మరో అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
హాంకాంగ్ సిక్సర్స్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. ఉత్తప్ప(28), చిప్లి(24), కార్తీక్(17) రాణించడంతో నిర్ణీత 6 ఓవర్లలో 86 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాక్ 3 ఓవర్లు ముగిసేసరికి 41/1 పరుగుల వద్ద ఉండగా, వర్షం అంతరాయం కలిగించింది. దీంతో D/L పద్ధతిలో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సౌతాఫ్రికా జాతీయ జట్టు ఈ నెల 14 నుంచి డిసెంబర్ 19 వరకు భారత్‌లో పర్యటించనుంది. షెడ్యూల్..★Tests: ఈ నెల 14 నుంచి 18 వరకు తొలి టెస్టు, 22 నుంచి 26 వరకు రెండో టెస్ట్★ ODIs: ఈ నెల 30న తొలి వన్డే, డిసెంబర్ 3న రెండో వన్డే, 6న మూడో వన్డే★ T20s: డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో 5 టీ20 మ్యాచ్‌లు
వరల్డ్ కప్‌లో సమష్టిగా విజయం సాధించామని భారత క్రికెటర్ శ్రీచరణి తెలిపింది. CM చంద్రబాబు, మంత్రి లోకేష్‌ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘గ్రూప్-1 ఉద్యోగం, రూ.2.5 కోట్లు, కడపలో ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. లోకేష్ ఎంతగానో ప్రోత్సహించారు. R అశ్విన్ ప్రశంసలు మరువలేనివి. ప్రధానితో ఇంటరాక్షన్ బాగుంది’ అని తెలిపింది.
AP: వరల్డ్ కప్‌లో సమష్టిగా విజయం సాధించామని భారత క్రికెటర్ శ్రీచరణి తెలిపింది. CM చంద్రబాబు, మంత్రి లోకేష్‌ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘గ్రూప్-1 ఉద్యోగం, రూ.2.5 కోట్లు, కడపలో ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. లోకేష్ ఎంతగానో ప్రోత్సహించారు. R అశ్విన్ ప్రశంసలు మరువలేనివి. ప్రధానితో ఇంటరాక్షన్ బాగుంది’ అని తెలిపింది.
T20ల్లో బుమ్రా, అర్ష్‌దీప్ కలిసి ఆడితే భారత్‌కి విజయం పక్కా అని గణాంకాలు చెబుతున్నాయి. ఇద్దరూ కలిసి ఆడిన 12 మ్యాచుల్లోనూ టీమిండియానే గెలిచింది. అలాగే ఈ 12 మ్యాచుల్లో బుమ్రా 20, అర్ష్‌దీప్ 23 వికెట్లు పడగొట్టారు. దీంతో టెస్టుల్లో అశ్విన్-జడేజా మాదిరి టీ20ల్లో ఈ జోడీ రాణిస్తోందని.. కీలక మ్యాచుల్లో వీరిని తప్పక ఆడించాలని ఫ్యాన్స్ అంటున్నారు.
భారత్ చేతిలో WWC సెమీస్ ఓటమి ఇంకా తమను వెంటాడుతోందని ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హేలీ తెలిపింది. సెమీస్ ఓడిపోవడం కొంతకాలం హర్ట్ చేస్తూనే ఉంటుందని పేర్కొంది. ఆ మ్యాచులో 350 రన్స్ చేసుంటే బాగుండేదని, జెమీమా క్యాచ్లను చేజార్చడం ఓటమికి కారణమైందని అభిప్రాయపడింది. కాగా సెమీస్‌లో జెమీమా(127*) పోరాటంతో భారత్ 5 వికెట్ల తేడాతో గెలవగా.. ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఆసీస్‌తో 4వ T20లో అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో AUSపై T20ల్లో 3 POTM అవార్డులు అందుకున్న ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సమంచేశాడు. అలాగే అత్యధిక అవార్డులు పొందిన 3వ IND ప్లేయర్‌గానూ యువరాజ్(7)ని అక్షర్(8) అధిగమించాడు. ఈ లిస్టులో కోహ్లీ, సూర్య(16) టాప్‌లో ఉండగా.. రోహిత్(14) 2వ స్థానంలో ఉన్నాడు.
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భాగంగా మధ్యాహ్నం 1.05 గంటలకు భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ పూల్-C లో ఇరుజట్లు ఉండగా.. భారత్‌ను దినేష్ కార్తీక్, పాక్‌ను అబ్బాస్ అఫ్రిది నడిపిస్తున్నారు. ఈ టోర్నీలో ఒక్కో టీమ్ ఆరుగురు ప్లేయర్లతో 6 ఓటర్ల ఆట ఆడుతుంది. అలాగే కీపర్ మినహా అందరూ బౌలింగ్ చేయాలి. ఐదుగురు ఔట్ అయినా ఆరో బ్యాటర్ ఆడొచ్చు. FanCodeలో లైవ్ చూడొచ్చు.
AP: విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణి రాక సందర్భంగా మాజీ క్రికెటర్ MSK ప్రసాద్‌ను ఎయిర్‌పోర్టు సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మాజీ చీఫ్ సెలెక్టర్ ప్రసాద్ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఏసీఏలోని పలువురిపై బీసీసీఐకి MSK ప్రసాద్ ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
భారత్, శ్రీలంక T20 వరల్డ్ కప్-2026కు ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు టోర్నీని ఫిబ్రవరి 7 నుంచి మార్చ్ 8 నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. టోర్నీ భారత్‌లోని అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై.. లంకలోని క్యాండీ, కొలంబోతో మరో వేదికలో జరుగుతుందని క్రీడావర్గాలు తెలిపాయి. అలాగే ఫైనల్ అహ్మదాబాద్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది.
స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సెప్టెంబర్ నెలకు ప్లేయర్ ఆఫ్ ది మంథ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఆక్టోబర్ అవార్డ్ కోసం కూడా నామినేట్ అయింది. ఈ అవార్డ్ కోసం సౌతాఫ్రికా కెప్టెన్ లారా, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్‌నీ ICC నామినేట్ చేసింది. అటు పురుషుల్లో నోమన్ ఆలీ(PAK), సేనురన్ ముత్తుసామి(SA), రషీద్ ఖాన్(AFG) నామినేట్ అయ్యారు.
ఆస్ట్రేలియాతో జరిగిన 4వ T20 మ్యాచులో శివమ్ దూబే భారీ సిక్సర్ బాదాడు. ఆడమ్ జంపా వేసిన 10వ ఓవర్ రెండో బంతిని దూబే బలంగా కొట్టడంతో బంతి స్టేడియం బయట పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. ఆ మ్యాచులో దూబే 22 రన్స్ చేసి ఎలిస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అలాగే ఈ మ్యాచ్ గెలిచిన భారత్ 5 T20ల సిరీస్‌లో 2-1 తేడాతో ముందంజలో ఉంది.
AP: భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. శ్రీ చరణికి విమానాశ్రయంలో మంత్రులు అనిత, సవిత, ఎంపీ కేశినేని చిన్ని ఘన స్వాగతం పలికారు. అయితే, విజయోత్సవ ర్యాలీని రద్దు చేశారు. కాగా, ఇవాళ సీఎం చంద్రబాబు శ్రీ చరణిని సత్కరించి అభినందించనున్నారు.