ఆసియా కప్‌లో ఇవాళ ‘గ్రూప్-A’లో భాగంగా యూఏఈతో టీమిండియా తలపడనుంది. అయితే, ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఏకైక T20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అలాగే, భారత్‌తో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల్లో కూడా UAE ఓడిపోయింది. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లో యూఏఈ.. టీమిండియాకు ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.
యూట్యూబర్ సప్నాగిల్‌తో వివాదం కేసులో టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై కోర్టు రూ.100 జరిమానా విధించింది. సప్నాగిల్ దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 13న క్రికెటర్ తరఫున న్యాయవాదికి చివరి అవకాశం ఇచ్చినా.. ఆయన ఇంకా స్పందించలేదని పేర్కొంది. పృథ్వీ షాకు మరో అవకాశం కల్పిస్తూ.. తదుపరి విచారణ డిసెంబర్ 16కి వాయిదా వేసింది.
ఇంగ్లండ్‌తో ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోయే 3 మ్యాచుల T20 సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని CSA ప్రకటించింది. అయితే, మిల్లర్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని మాత్రం ప్రకటించలేదు. ఇంగ్లండ్ సిరీస్‌లో ఆ జట్టు 14 మంది సభ్యులతోనే కొనసాగనుంది.
ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ యూఏఈతో టీమిండియా తొలి మ్యాచ్ జరగనుంది. అయితే, నిన్న టీమిండియాకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. అవసరం లేదనకుంటే హాజరు కాకుండా ఉండే అవకాశం ప్లేయర్లకు ఉంది. ఈ ప్రాక్టీస్‌కు సంజు శాంసన్, బుమ్రా వెళ్లలేదని సమాచారం. మరోవైపు అభిషేక్ శర్మ భారీగా సిక్సర్లతో విరుచుకుపడ్డాడని తెలుస్తుంది.
ఆసియా కప్ టీ20 టోర్నీలో హాంకాంగ్‌తో జరిగిన ఆరంభ పోరులో అఫ్గాన్94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. సెధిఖుల్లా 73, ఒమర్జాయ్ 53 రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 188 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో 94/9 పరుగులు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్ 2, నైబ్ 2, ఒమర్జాయ్, నూర్, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో డేవాల్డ్ బ్రెవిస్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు అతడిని 16.50 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8.31 కోట్లు) కొనుగోలు చేసింది. అలాగే, ఐడెన్ మార్‌క్రమ్‌ను డర్బన్ సూపర్ జెయింట్స్ 14 మిలియన్ల (సుమారు రూ. 8 కోట్ల)కు దక్కించుకుంది.
ఆసియా కప్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ మెగాటోర్నీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్ల కెప్టెన్‌లు ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 8 జట్ల కెప్టెన్‌లు ట్రోఫీతో ఫొటో దిగారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, రాత్రి 8 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్, హాంకాంగ్ తలపడనున్నాయి.
ఆసియా కప్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొంటున్న 8 జట్ల కెప్టెన్లతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆసియాలోని అత్యుత్తమ జట్లతో తలపడటం ఒక సవాలుగా ఉంటుందని అతడు పేర్కొన్నాడు. ముఖ్యంగా, పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.
ఆసియాకప్‌లో భాగంగా టీమిండియా రేపు UAEతో తలపడనుంది. ఈ సందర్భంగా గిల్‌తో ఉన్న అనుబంధాన్ని UAE ప్లేయర్ సిమ్రన్‌జిత్ సింగ్ వివరించాడు. సిమ్రన్ జిత్ స్వస్థలం పంజాబ్‌లోని లూథియానా. 12 ఏళ్ల క్రితం తాను మొహాలిలో గిల్‌తో కలిసి సాధన చేసినట్లు తెలిపాడు. ‘ఇప్పుడు గిల్ గుర్తుపడతాడో లేదో తెలియదు. ఆ రోజుల్లో అతడికి చాలాసార్లు బౌలింగ్ చేశాను’ అని గుర్తుచేసుకున్నాడు.
ఆసియా కప్‌కు ముందు టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల కేరళలో జరిగిన టీ20 టోర్నీలో అర్జించిన జీతాన్ని సహచరులు, సహాయక బృందానికి విరాళంగా ఇచ్చాడు. ఈ టోర్నీ ద్వారా సంజూ రూ.26.8 లక్షలు పొందాడు. కాగా, ఈ టోర్నీ వేలంలో సంజూ రూ.50 లక్షలకు అమ్ముడుపోయాడు. అయితే, కొచ్చితో తనకున్న అనుబంధంతో సగం డబ్బుకే ఆడేందుకు ఒప్పుకున్నాడు.
ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ ఆఫ్గాన్, హాంకాంగ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రేపు యూఏఈతో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో భారత జట్టును యూఏఈ ఓపెనర్ అలీషాన్ షరాఫు కొనియాడాడు. భారత జట్టు మొత్తం సూపర్ స్టార్స్‌తో నిండి ఉందన్నాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటివారు మ్యాచ్ విన్నర్లని చెప్పాడు. వారు ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారని పేర్కొన్నాడు.
ఆసియా కప్ కోసం సోనీ స్పోర్ట్స్ కామెంటరీ ప్యానెల్‌ను ప్రకటించింది. ఈ ప్యానెల్‌లో వరల్డ్ ఫీడ్ అందించడానికి గవాస్కర్, రవిశాస్త్రి, ఉతప్ప, సంజయ్ మంజ్రేకర్, వసీం అక్రమ్, బాజిద్ ఖాన్, రసెల్ ఆర్నాల్డ్, సైమన్ డౌల్ ఎంపికయ్యారు. హిందీ ప్యానెల్‌లో సెహ్వాగ్, అజయ్ జడేజా, ఇర్ఫాన్ పఠాన్, అభిషేక్ నాయర్ సభ్యులుగా ఉన్నారు. తెలుగులో వెంకటపతి రాజు, వేణుగోపాల్ రావు వ్యవహరిస్తారు.
ఆసియా కప్ విజయాన్ని పంజాబ్ వరద బాధితులకు అంకితమిస్తున్నట్లు భారత హాకీ జట్టు మిడ్ ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ తెలిపాడు. ప్రతి బాధితునికి.. అవసరంలో ఉన్నవారిని రక్షించడానికి కృషి చేస్తున్న నిస్వార్థ స్వచ్ఛంద సేవకులకు అంకితమని చెప్పాడు. కాగా, జలంధర్ శివారులోని మిథాపూర్‌లో గ్రామంలో జన్మించిన మన్‌ప్రీత్.. ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.
ఫిడె గ్రాండ్ స్విస్ 2025లో భారత చెస్ స్టార్ గుకేశ్‌కు షాక్ తగిలింది. గుకేశ్‌ను అమెరికా గ్రాండ్‌మాస్టర్ అభిమన్యు మిశ్రా ఓడించాడు. దీంతో 16 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి అభిమన్యు చరిత్ర సృష్టించాడు. మిశ్రా 61 ఎత్తుగడలతో ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, ఈ టోర్నమెంట్ మునుపటి గేమ్స్‌లా అంత ఆహ్లాదకరంగా అనిపించలేదని తెలిపాడు.